నీట్‌కు 53 మంది గైర్హాజర్‌ | - | Sakshi
Sakshi News home page

నీట్‌కు 53 మంది గైర్హాజర్‌

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

నల్లగొండ : నీట్‌ (నేషనల్‌ ఎల్జిబులిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఆదివారం నల్లగొండలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు మహిళా డిగ్రీ కాలేజీ, ఎన్జీ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్జీ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 6 కేంద్రాల్లో 2,038 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,985 అభ్యర్థులు హాజరయ్యారు. 53 మంది గైర్హాజర్‌ అయ్యారు.

పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ..

జిల్లా కేంద్రంలో జరిగిన నీట్‌ కేంద్రాలను కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తనిఖీ చేశారు. రామగిరిలోని మహిళా డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌, ఎస్పీ కలిసి తనిఖీ చేయగా.. ఎంజీయూ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement