నెల్లిబండ జాతర ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నెల్లిబండ జాతర ప్రారంభం

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

నకిరేకల్‌ : మండల పరిధిలోని నెల్లిబండ గుట్ట మీదున్న లింగమంతుల స్వామి, సౌడమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. జాతర సందర్భంగా నెల్లిబండ గుట్టంతా మూడు రోజులపాటు భక్తులతో నిండిపోతుంది. ఆదివారం రాత్రి నెల్లిబండ గ్రామంలోని మిద్దెగూడెం నుంచి భజన, బేరీ చప్పుళ్లతో దేవరను ఊరేగింపుగా తీసుకుని గట్టుమీదికి చేర్చడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

నేటి జాతర కార్యక్రమాలు

సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7గంటలకు కుంకుమార్చన, కంకణధారణ, 8 గంటలకు బోనాలు, యాటల బలి, సాయంత్రం 5గంటలకు ఆకువంచమభోనం, 5వ తేదీన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పసుపు కుంకుమలతో దేవుడి పటం (చిత్రపటం) వేస్తారని ఆలయ చైర్మన్‌ యానాల యాదగిరెడ్డి, సర్పంచ్‌ ఆడెపు రాఘవులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement