నెల రోజుల్లోనే రూ.8.80 కోట్లు | - | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లోనే రూ.8.80 కోట్లు

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

పెన్షన్‌దారుల బారులు

ఇంటర్‌ సప్లిమెంటరీకి

ప్రత్యేక తరగతులు

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ : ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు రెమిడియల్‌ (ప్రత్యేక) తరగతులు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నల్లగొండ కలెక్టరేట్‌ నుంచి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో 15 ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయని, మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షలు రాసిన విద్యార్థులలో 1982 మంది ఫెయిల్‌ అయ్యారని, వారికి ఏప్రిల్‌ 18 నుంచే హాఫ్‌ లైన్‌లో రెమిడియల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, డీఐఈఓ అధికారి దస్రు నాయక్‌, బలప్రసాద్‌, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముందస్తు ఆస్తి పన్ను రికార్డు స్థాయిలో వసూలైంది. పభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ (ఎర్లీబర్డ్‌ స్కీం)ని నీలగిరి మున్సిపల్‌ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి నీలగిరిలో 33 మంది వార్డు ఆఫీసర్లు ఎంతో కృషిచేశారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గేటెడ్‌ కాలనీలు, అపార్ట్‌మెంట్‌ బాధ్యులను కలిసి రాయితీపై ప్రచారం కల్పించడంతో కార్పొరేషన్‌ పెట్టుకున్న లక్ష్యానికి మించి పన్ను వసూలు చేశారు. నెల రోజుల్లోనే రూ.8.80 కోట్లు వసూలు చేసి నీలగిరి కార్పొరేషన్‌ యంత్రాంగం రికార్డు సృష్టించింది.

డిమాండ్‌ రూ.18.50 కోట్లు..

నీలగిరి మున్సిపల్‌ పరిధిలోని 48 డివిజన్లలో 33 వేల వరకు భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి ఆస్తి పన్ను రూ.18.50 కోట్లు రావాల్సి ఉంటుంది. రూ.18.50 డిమాండ్‌కు గాను మున్సిపల్‌ కార్పొరేషన్‌ వార్డు ఆఫీసర్లు ఒక్క నెలలోనే 13 వేల మంది మంది నుంచి రూ.8.80 కోట్లు వసూలు చేశారు. ఐదుశాతం రాయితీతో సాధ్యమైనంత ఎక్కువ పన్నువసూలు చేయాలనే లక్ష్యంతో నగర మేయర్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర నిరంతరం రెవెన్యూ విభాగాన్ని పర్యవేక్షించడం, విస్తృతంగా ప్రచారం చేయించడంతో టార్గెట్‌ను మించిపోయారు. గతేడాది ఏప్రిల్‌ నెలలో రూ.6.50 కోట్లు వసూలు చేయగా ఈ సారి అదనంగా రూ.2.30 కోట్లు వసూలు చేయగలిగి రూ.8.80 కోట్లకు చేరుకుకోవడం విశేషం. అయితే ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ అవకాశం గురువారంతో ముగిసింది.

ఫ నీలగిరి కార్పొరేషన్‌లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు

ఫ ఫలించిన వార్డు ఆఫీసర్ల కృషి

ఫ ముగిసిన ఐదు శాతం రాయితీ గడువు

Advertisement
 
Advertisement
Advertisement