విద్యాభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

కొండమల్లేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభిభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇందులో భాగంగానే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కొండమల్లేపల్లి మండలం కోల్‌ముంతల్‌పహాడ్‌ గ్రామ పంచాయతీ పరధిలోని రైతువేదిక సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించతలపెట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ నూతన పాఠశాల భవన నిర్మాణానికి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌, కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అలాగే రూ.80 లక్షలతో చేపట్టే కేజీబీవీ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనానికి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. 15 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్‌ విజ్ఞప్తి మేరకు పెండింగ్‌ నీటి ప్రాజెక్టుల పూర్తికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

ప్రాజెక్టులు పూర్తయితే కరువుండదు :

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, పెండ్లిపాకల రిజర్వాయర్‌ ఎత్తు పెంపు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగు, తాగు నీటికి కరువుండదన్నారు. ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ మాట్లాడుతూ విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమనే నమ్మకంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా స్కూళ్లకు శ్రీకారం చుట్టిందన్నారు. దేవరకొండలోని ప్రభుత్వ వైద్యశాలను 200 పడకల ఆసుపత్రిగా మార్చాలని మంత్రిని, మండలి చైర్మన్‌ను కోరారు. కార్యక్రమంలో నల్గొండ మేయర్‌ బుర్రి చైతన్యా శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జమునా మాధవరెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీఓ సరళ, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వేమన్‌రెడ్డి, కోల్‌ముంతల్‌పహాడ్‌ సర్పంచ్‌ రమావత్‌ సరస్వతిరవినాయక్‌, పసునూరి యుగంధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖాశ్రీధర్‌రెడ్డి, దూదిపాల వేణుధర్‌రెడ్డి, పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ సిరాజ్‌ఖాన్‌, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ కోల్‌ముంతల్‌పహాడ్‌లో యంగ్‌

ఇండియాస్కూల్‌ నిర్మాణానికి భూమిపూజ

ఫ మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్‌ హాజరు

Advertisement
 
Advertisement
Advertisement