కేతేపల్లి : మూసీ ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సూపరింటెండెంట్ ఇంజనీర్ కొల్లు సురేఖరాణి గురువారం సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో కలసి డ్యాం గేట్లు, స్పిల్‌వే, రిజర్వాయర్‌లో నీటి నిల్వలను పరిశీలించారు. ప్రాజెక్టును ఎప్పుడు నిర్మించారు, గరిష్ట నీటినిల్వ సామర్ధ్యం, ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వెళ్లే వరదనీటి సామర్ధ్యం, ప్రాజెక్టు కింద సాగవుతున్న ఆయకట్టు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిర్వాయర్‌లో పూడిక బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన స్కవర్ గేట్లను కాంక్రీట్ వేసి శాశ్వతంగా ఎందుకు మూసివేశారని అధికారులను ఆమె ప్రశ్నించగా.. స్కవర్ గేట్లు తరచూ మరమ్మతులకు గురై నీరు లీకవుతుండటంతో 30 ఏళ్ళ క్రితమే అప్పటి అధికారులు సీజ్ చేశారని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్టు మెయింటనెన్స్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌రెడ్డి, జేఈ మధు, సిబ్బంది ఉన్నారు.


