నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని బైపాస్ నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టిపై థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు చేయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జాతీయ రహదారుల అధికారికి ఫిర్యాదు చేయగా ఇటీవల నమూనాలు సేకరించిన అధికారులు సరైన పరీక్షలు చేయలేదని పేర్కొన్నారు. తాము చూపించిన దగ్గర సాయిల్ టెస్ట్ చేయకుండా కాంట్రాక్టర్‌ను కాపాడేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. వెంటనే థర్డ్ పార్టీ సాయిల్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. లేకుంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళతామన్నారు. వర్షిత్‌రెడ్డి వెంట ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఉన్నారు.


