నల్లగొండ : పదో తరగతి ఫలితాల్లో మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 13 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నల్లగొండ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న మొత్తం 64 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలలో 38 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. వీరిలో సమీరా 560 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. సమీరా బేగం 559, వై.సానియా 558, జోహాషాజ్ 557 మార్కులు సాధించారు. విద్యార్థినులను జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ, ఇన్‌చార్జి టీఎంఆర్‌ఈఎస్ నల్లగొండ మహ్మద్ అబ్దుల్ ఖయ్యూం, ఆర్‌ఎల్‌సీ శ్రీకాంత్, షాహీన్ షేక్ ఉపాధ్యాయులు అభినందించారు.
సమీరా బేగం
జోహాషాజ్
ఏకుల సన్య


