బాలభవన్ ఆధ్వర్యంలో ..
అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆసక్తి గల వారు క్యాంపు దగ్గరికి వెళ్లి పేర్లు నమోదు చేయించుకోవాలి. క్రీడా సామగ్రి రాగానే శిక్షణ ప్రారంభిస్తాం.
– అక్బర్ అలీ, జిల్లా యువజన క్రీడల అధికారి
మే 1 నుంచి సమ్మర్
క్రీడా శిక్షణ శిబిరాలు
ఫ రెండు మూడు రోజుల్లో జిల్లాకు చేరనున్న క్రీడా సామగ్రి
ఫ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా.. పట్టణాల్లో ఫీజు వసూలు
నల్లగొండ టూటౌన్ : వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఈనెల 24 నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంత వరకు క్రీడా సామగ్రి జిల్లాకు చేరకపోవడంతో మే 1వ తేదీ నుంచి సమ్మర్ క్యాంపు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ శిబిరాలాల్లో జూన్ 7 వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారులు సిద్ధమయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిబిరాలను విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక వికాసం పెంపొందించడంతో పాటు వినోదాన్ని అందించేందుకు ఎంతగానో దోహదపడతాయి.
క్రీడలు ప్రోత్సహించేందుకు..
విద్యార్థుల్లో వివిధ క్రీడలను ప్రోత్సహించడానికి వేసవి క్రీడా శిభిరం నిర్వహిస్తున్నారు. వారికి ఇష్టమైన క్రీడలను ఈ వేసవి శిక్షణ శిబిరంలో నేర్పించనున్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి శిక్షణలు వేదిక కానున్నాయి. మే 1 నుంచి శిబిరాలను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఈలోగా విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నారు. శిబిరాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది.
గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతంలో వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, బేస్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్, తదితర క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని నిడమనూరు, ఇబ్రహీంపేట (హాలియా) (కబడ్డీ), జెడ్పీహెచ్‌ఎస్ గట్టుప్పల్ (బాల్ బ్యాడ్మింటన్), బాలాజీనగర్ (పీఏపల్లి) (బేస్‌బాల్), ఎన్జీ కాలేజీ నల్లగొండ (హాకీ), జెడ్పీహెచ్‌ఎస్ తిప్పర్తి (హ్యాండ్‌బాల్), ఔట్‌డోర్ స్టేడియం నల్లగొండ (పుట్‌బాల్), జెడ్పీహెచ్‌ఎస్ వెల్మకన్నె (గట్టుప్పల్) (వాలీబాల్), జెడ్పీహెచ్‌ఎస్ నకిరేకల్ (హ్యాండ్‌బాల్), జెడ్పీహెచ్‌ఎస్ కనగల్ (కబడ్డీ)లో గ్రామీణ క్రీడాకారులకు ఈ క్యాంపులు నిర్వహించనున్నారు.
అర్బన్ ప్రాంతంలో ఫీజు..
అర్బన్ ప్రాంతాల్లో మాత్రం విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. క్రీడను బట్టి రూ.100 నుంచి రూ.1000 వసూలు చేయనున్నారు. జెడ్పీహెచ్‌ఎస్ కురంపల్లిలో బ్యాడ్మింటన్, నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో చెస్, జెడ్పీహెచ్‌ఎస్ మిర్యాలగూడలో వాలీబాల్, ఇండోర్ స్టేడియం నల్లగొండలో టేబుల్ టెన్నీస్, షటిల్ బ్యాడ్మింటన్, ఎన్జీ కాలేజీ నల్లగొండలో కబడ్డీ, ఔట్‌డోర్ స్టేడియం నల్లగొండలో ఖోఖో, ఇండోర్ స్టేడియం మిర్యాలగూడలో షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, ఎన్జీ కాలేజీ నల్లగొండలో అథ్లెటిక్స్, నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని తైక్వాండో సెంటర్‌లో తైక్వాండో, ఇండోర్ స్టేడియం నల్లగొండలో తైక్వాండో, ఉరుమడ్ల (చిట్యాల)లో హాకీ క్రీడా పోటీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
నల్లగొండ : జిల్లా విద్యాశాఖ, బాల భవన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు 40 రోజుల పాటు నల్లగొండలోని బోయవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 నుంచి 11 వరకు శాసీ్త్రయనృత్యం, చిత్ర లేఖనం, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్‌లో శిక్షణ ఇస్తారు. 6 నుంచి 16 సంవత్సరాల బాలబాలికలకు వీటిని ఉచితంగా నేర్పిస్తారు. రిసోర్స్ పర్సన్లు, టీచర్లు, సమాజ సేవకులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇతర వివరాలకు 94404 40939, 94416 60881 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని డీఈఓ భిక్షపతి సూచించారు.


