హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

నల్లగొండ టూటౌన్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రాచారం చేసిన సీఎం రేవంత్‌కు, కాంగ్రెస్‌కు.. హైకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. గురువారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి కూలేశ్వరం అయిందని ప్రచారం చేసిన వారికి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఇకనైనా బుద్ధి రావాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గమంతా ఏపీ సీఎం చంద్రబాబుకు, అక్కడి రాష్ట్రం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్టుకు రోజుకు 0.5 టీఎంసీ నీటిని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హామీలు అమలు చేయకుండా, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తాం..

కరెంట్‌ లేక, యూరియా అందక అష్టకష్టాలు పడి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నేటి నుంచి మాజీ ఎమ్మెల్యేలంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే రైతులను సమీకరించి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, నాయకులు చకిలం అనిల్‌కుమార్‌, కొండూరు సత్యనారాయణ, సింగం రామ్మోహన్‌, వంగాల సహదేవరెడ్డి, బోనగిరి దేవేందర్‌ పాల్గొన్నారు.

ఫ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement