ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

అడవిదేవులపల్లి : రైతుల కష్టాలను తీర్చేందుకు దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌సీ మల్లికార్జున్‌, ఈఈ కేశవతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దున్నపోతుల గండి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్న తరువాత ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దున్నపోతుల గండి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలన్నారు. వారి వెంట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాలునాయక్‌ తదితరులు ఉన్నారు.

ఫ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement