దేవరకొండ : దేవరకొండ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం గురువారం సందర్శించింది. డాక్టర్ సాయికిరణ్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఆస్పత్రికి చేరుకొని రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత, ఆస్పత్రి నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. ఆస్పత్రిలోని వార్డులు, వాటి నిర్వహణ, వైద్య సేవలు, సిబ్బంది వివరాలపై ఆరాతీశారు. ఆస్పత్రిలోని ఇన్‌పేషంట్–అవుట్ పేషంట్, డయాలసిస్, మాతా శిశుసంరక్షణ కేంద్రం, జనరల్ ఓపీ, మెటర్నటీ, ఎమర్జెన్సీ విభాగాలను సందర్శించారు. ఈ బృందం ఇక్కడ పరిశీలించిన అంశాలపై ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేయనుంది. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్, వైద్యులు కృష్ణ, సిబ్బంది తదితరులున్నారు.


