ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్‌ డిపో వద్ద బుధవారం కార్మికుల సమ్మెకు బుధవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ఎలక్ట్రిక్‌ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని కోరారు. ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ సమ్మెను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కెఎస్‌.రెడ్డి, ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు బి.నరేందర్‌, యార చంద్రయ్య, రాజు, రావు, ఏఎల్‌ స్వామి, శంకరమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement