హెల్మెట్‌ ధరిస్తేనే.. ఎంట్రీ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరిస్తేనే.. ఎంట్రీ

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

నేటి నుంచి కలెక్టరేట్‌ వద్ద అమలు

నల్లగొండ : నల్లగొండ కలెక్టరేట్‌లో గురువారం నుంచి నో హెల్మెట్‌.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచిస్తున్నారు. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ గురువారం నుంచి కలెక్టరేట్‌కు వచ్చే సిబ్బంది, అధికారులు, వివిధ పనుల కోసం ద్విచక్ర వాహనంపై వచ్చే వారు హెల్మెట్‌ ధరిస్తేనే కలెక్టరేట్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. అందులో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ గేటుకు ‘నో హెల్మెట్‌.. నో ఎంట్రీ’ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా సరే గురువారం నుంచి హెల్మెట్‌ లేకుండా వస్తే కలెక్టరేట్‌ లోపలికి అనుమతించరు.

Advertisement
 
Advertisement
Advertisement