మే 1 నుంచి పీజీ కళాశాలలకు సెలవు | - | Sakshi
Sakshi News home page

మే 1 నుంచి పీజీ కళాశాలలకు సెలవు

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలోని రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎగ్జామ్‌ బ్రాంచ్‌, ప్రిన్సిపాల్‌, ఇతర కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని కళాశాలలు జూన్‌ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

ఆలయ భూముల పరిశీలన

చిట్యాల : మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని శ్రీతిరుమలనాథ స్వామి ఆలయ భూములను అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ బుధవారం పరిశీలించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురవతున్నాయని పెద్దకాపర్తి వార్డు సభ్యుడు మర్రి హారీష్‌రెడ్డి, మాచర్ల యాదగిరి, చేకూరి గణేష్‌ వేర్వేరుగా ప్రజావాణిలో కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆలయ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, ఎండోమెంట్‌ అధి కారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ 201 సర్వే నంబర్‌లో అక్రమణకు గురైన ఆలయ భూములను గుర్తించి పరిరక్షిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, మైనింగ్‌ ఏడీ బాలు, దేవాదాయ శాఖ అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.

ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేస్తాం

పెద్దఅడిశర్లపల్లి : ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ జయశ్రీ, ఎంపీడీఓ చంద్రమౌళి అన్నారు. బుధవారం ‘సాక్షి’లో ‘కోతకు ఒప్పుకుంటేనే.. కొనుగోలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు మండలంలోని అంగడిపేట ఎక్స్‌ రోడ్‌ వద్ద పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తేమశాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.

యాదగిరీశుడికి నిత్యారాధనలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

భీమ్‌ ఆర్మీ జిల్లా

అధ్యక్షుడిగా నాగరాజు

నార్కట్‌పల్లి : భీమ్‌ ఆర్మీ భారత్‌ ఏక్తా మిషన్‌ జిల్లా అధ్యక్షుడిగా నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన వడ్డేపల్లి నాగరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం భీమ్‌ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సామాజిక న్యాయం, బహుజన రాజ్యాధికారం కోసం అంకితభావంతో పని చేస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement