సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడొద్దు | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడొద్దు

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

నల్లగొండ : సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కారణంగా ప్రకృతి పెను విపత్తు ఎదుర్కొంటోందని.. ప్రజలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడొద్దని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయ నుంచి కలెక్టరేట్‌ వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల ప్రాణకోటికి ప్రమాదం ఏర్పడిందన్నారు. కాలుష్యం నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ధరిత్రిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కాటన్‌ బ్యాగులు తీసుకెళ్లాలని, ప్లాస్టిక్‌ బాటిల్‌కు బదులు స్టీల్‌ లేదా మట్టి వాటర్‌ బాటిల్స్‌ వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం, ప్రకతిని కాపాడే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ధరిత్రి దినోత్సవంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, డీఎస్‌డీఓ మహమ్మద్‌ అక్బర్‌అలీ, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

ఫ ధరిత్రి దినోత్సవం

సందర్భంగా సైకిల్‌ ర్యాలీ

Advertisement
 
Advertisement
Advertisement