శాలిగౌరారం : దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేదని అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అద్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని ఇటుకులపహాడ్‌లో నిర్వహించిన ఏఐకేఎంఎస్ నల్లగొండ జిల్లా 11వ మహాసభలో ఆయన మాట్లాడారు. రైతు పండించిన పంటకు రైతే ధరను నిర్ణయించుకునే హక్కు లేకపోవడంతో దళారీల చేతిలో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్త అదాని ఆదాయం రోజుకు రూ.1600 కోట్లు ఉందని, చెమటోడ్చే రైతులకు మాత్రం ఆదాయం సంగతేమో కానీ ఆత్మహత్యలు మిగులుతున్నాయని చెప్పారు. నేటీ బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి విబిజిరాంజీ పథకాన్ని తీసుకువచ్చి రాష్ట్రాలపై ఆధారపడేలా చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, ఉపాద్యక్షులు సిలివేరు జానయ్య, నాయకులు గజ్జి రవి, వేముల శంకర్, అంబటి కృష్ణమూర్తి, నర్సయ్య, కల్లూరి అయోధ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, కుంభం వెంకటేశం, బూరుగు సత్తయ్య, పజ్జూరు ఉపేంద్ర, బివి.చారి, పోలె పవన్, మామిడోజు వెంకటేశ్వర్లు, రావుల లింగయ్య, అంబటి మహేశ్, జయరాజ్, యాదమ్మ, సుజాత, శైలజ, సునీత, పుష్ప, ఉమా తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అద్యక్షుడు కోటేశ్వరరావు


