నల్లగొండ : ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ తమ ప్రాణ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. హెల్మెట్ ప్రాముఖ్యతపై బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. మీడియా సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో మీడియా ముందుండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే అలవాటు కలిగేలా చూడాలన్నారు. అనంతరం శాంతలక్ష్మి ఫౌండషన్ ఆధ్వర్యంలో కంబాలపల్లి ఉపేందర్, మన్నెం యాదగిరి సహకారంతో మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాము, రాజశేఖర్‌రెడ్డి, మహాలక్ష్మయ్య,ఉ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


