హాలియా నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాం. తిరిగి హాలియాకు వెళ్దామని వచ్చి నల్లగొండ బస్టాండ్‌లో బస్సు కోసం రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నాము. చిన్న బాబు ఉన్నాడు ఎండకు తీవ్ర ఇబ్బంది అవుతోంది.
– సహదేవ, ప్రయాణికుడు
ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి సమ్మెను నిలిపివేయాలి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది. గ్రామాలకు ఆటోలు కూడా లేని వారికి ఇబ్బంది అవుతోంది. ఎండకు ఆటోలో ప్రయాణించే పరిస్థితి లేదు.
– మానస, ప్రయాణికురాలు
ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల్సిందే. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను అమలు చేయాలి. 2017 నుంచి ఏరియర్స్ చెల్లించాలి.
– పి.శారద, ఆర్టీసీ ఉద్యోగి
ఉద్యోగుల డిమాండ్లను ఒ ప్పుకునేంత వరకు సమ్మె ను విరమించేది లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. యూనియన్లను పునరుద్ధరించాలి. మూడు సంవత్సరాలుగా వేచి చూస్తున్నాం. తప్పని పరిస్థిల్లో సమ్మెకు వెళ్లాం. ప్రభుత్వ బెదిరింపులకు భయపడం.
– ఎండీ.లతీఫ్, డ్రైవర్


