ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయి..
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మాండ్ర నరేష్ గ్రూప్– 1 ఫలితాల్లో 466 మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో 290 ర్యాంక్ సాధించాడు. నరేష్ సోదరుడు రమేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా నరేష్ చిన్నతనంలోనే గ్రూప్– 1లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అన్నాదమ్ముళ్లు తాత, నానమ్మల దగ్గర ఉంటూ పెరిగారు. నరేష్ 10వ తరగతి వరకు తిమ్మాపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో చదవుకొని ఇంటర్ సూర్యాపేటలో పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్ద ఉంటూ గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాడు. ర్యాంక్‌ను బట్టి గ్రూప్ –1 అధికారిగా ఎంపికకానున్నారు.


