సంబరాల సంక్రాంతి
సాక్షి, నెట్‌వర్క్ : ముంగిట్లో భోగిమంటలు.. వాకిట్లో ముగ్గులు.. పసుపుకుంకుమలు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తలనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. పిండివంటల ఘుమఘుమలు.. పిల్లలు, యువతుల కేరింతలు.. నింగికెగిరిన పతంగులు.. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభనుసంతరించుకున్నాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా బుధవారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే భోగిమంటలు వేసి భోగిభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకున్నారు. పిల్లలతల పై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. గురువారం సంక్రాంతి పండుగను జరుపుకోనుననారు.
సంక్రాంతి రోజు చేయాల్సింది ఇదే..
శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి. సూర్యుడు సంక్రమణం జరిగే సమయంలో పూజలు చేస్తే పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజు మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు, దేవతలకు దానాలు చేయాలి.
ఫ అంబరాన్నంటిన భోగి వేడుకలు
ఫ రంగవల్లులతో ఆకట్టుకున్న లోగిళ్లు
ఫ హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు
ఫ బంధుమిత్రులు, ఆడపడుచుల
రాకతో మురిసిన పల్లె, పట్నం
సంబరాల సంక్రాంతి
సంబరాల సంక్రాంతి


