కమనీయం.. గోదా కల్యాణం
రామగిరి(నల్లగొండ) : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నల్లగొండలోని రామగిరి రామాలయంలో గోదాదేవీ, రంగనాథ స్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి దంపతులు, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఆలయాల్లో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, కల్యాణ మంగళారతులు నిర్వహించారు. భక్తులు తిరుప్పావై పారాయణం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


