వైభవంగా ‘భోగి’ బోనాలు
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో బుధవారం భోగి బోనాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్దంగా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠమహేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించారు. ఆలయాల వద్ద బోనాలతో ప్రదక్షిణలు నిర్వహించారు. మోత్కూరు కొత్త బస్టాండ్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద, బిక్కేరు చెంత, అమ్మనబోలు రోడ్డు పక్కన కంఠ మహేశ్వర స్వామి ఆలయాల వద్ద బోనాలను మహిళలు సమర్పించారు. శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుళ్లతో బాణసంచా పేలుస్తూ బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.


