సీఎం కప్ క్రీడలతో ప్రతిభ వెలుగులోకి..
● కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ : సీఎం కప్ క్రీడాపోటీలతో క్రీడాకారుల ప్రతిభ వెలికితీయొచ్చని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17 నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కప్ పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎంఈఓలు, పీఈటీలతో కోరారు. ఈ పోటీల్లో అందరినీ భాగస్వాములు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, మల్లారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్‌ఖాన్, కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, అబ్బగోని రమేష్‌గౌడ్, గుమ్మల మోహన్‌రెడ్డి, మీర్ అక్బర్‌అలీ పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూంలు
పంపిణీ చేయాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడలో వృథాగా పడి ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మరమ్మతు చేయించి మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు పేదలకు ఇళ్లు అందించకపోవడం దురదృష్టకరమన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడు పేదల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న నల్లగొండలో జరిగే నిరసన ప్రదర్శనకు, ఈనెల 25న హైదరాబాద్‌లో జరిగే ఐద్వా జాతీయ మహాసభలకు మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రొండి శ్రీనివాస్, పరుశురాములు, వినోద్‌నాయక్, రామ్మూర్తి, గోవర్ధన, ఊర్మిళ, సత్యనారాయణరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడలతో ప్రతిభ వెలుగులోకి..


