సాక్షి, యాదాద్రి, నకిరేకల్, చౌటుప్పల్, తిరుమలగిరి : కొద్ది రోజల వ్యవధిలోనే పార్టీ మారి కాంగ్రెస్ టికెట్ సాధించిన పలువురు నేతలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో నకిరేకల్ నుంచి గెలిచిన వేముల వీరేశం, మునుగోడుఉ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల సామేల్, భువనగిరి నుంచి గెలుపొందిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
ఫ భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆగస్టులో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్న ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిపై 26 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.