మట్టపల్లి క్షేత్రంలో నారసింహుడి కల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేకార్చనలు, మూల విరాట్‌మూర్తికి, పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి, శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. నీరాజన మంత్రపుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌, పాలకమండలి సభ్యులు కె.వెంకటనారాయణ, కొండల్‌రెడ్డి, అర్చకులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top