భువనగిరి: గూడూరు నారాయణరెడ్డి
పుట్టినతేదీ: 26.02.1963, తల్లిదండ్రులు: గూడురు మంగారెడ్డి, భారతి
భార్య: పద్మావతిదేవి, పిల్లలు: ప్రియదర్శిని, శమంతిక, ప్రణయ్
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ ప్రస్థానం: 2005 నుంచి 2020 వరకు ఏఐసీసీ సభ్యుడిగా
కొనసాగారు. 2020లో బీజేపీలో చేరారు.
సేవా కార్యక్రమాలు: 300 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు, రజకులకు ఇసీ్త్ర పెట్టెలు, నాయీ బ్రాహ్మణులకు కిట్లతో పాటు 800 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇప్పించారు.
నాగార్జునసాగర్: కంకణాల నివేదితరెడ్డి
పుట్టిన తేదీ: 12.05.1976, తల్లిదండ్రులు: నిర్మలాదేవి, జైహింద్‌రెడ్డి
స్వస్థలం: తిరుమలగిరి, పెద్దఅడిశర్లపల్లి మండలం
భర్త: కంకణాల శ్రీధర్‌రెడ్డి (బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు)
కుమార్తెలు: కావ్య, కీర్తి, విద్యార్హత: బీఎస్సీ (జనటిక్స్)
రాజకీయ నేపథ్యం: ఉన్నత విద్య పూర్తిచేసిన తర్వాత బాగ్ సంపర్క్ ప్రముఖ్, రాష్ట్రీయ సేవికా సమితి సభ్యురాలిగా, వీఎన్‌ఐటీ (విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), నాగపూర్ బోర్డు ఆఫ్ గవర్నింగ్ సభ్యురాలిగా, ఏబీవీపీతో పాటు మహిళా సమన్వయ ఆర్గనైజేషన్‌లో పనిచేశారు.
తుంగతుర్తి : కడియం రామచంద్రయ్య
పుట్టిన తేదీ: 4.6.1960, తల్లిదండ్రులు: కడియం వెంకయ్య, సోమక్క
భార్య: సరస్వతి, కుమారులు: కళ్యాణ్ చందర్, జైచంద్ర
స్వస్థలం: నాగారం, విద్యార్హత: ఎంఎస్సీ, బీఈడీ
ఉద్యోగం: మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ
2018లో రిటైరయ్యారు.
రాజకీయ ప్రవేశం: 2018లో బీజేపీలో చేరి తుంగతుర్తి ఎమ్మెల్యేగా
పోటీ చేశారు.
సేవా కార్యక్రమాలు: 2008లో తన తల్లి పేరిట కడియం సోమక్క మెమొరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
సూర్యాపేట: సంకినేని వెంకటేశ్వరరావు
పుట్టిన తేదీ: 10.06.1963, తల్లిదండ్రులు: సంకినేని రామారావు, కమలమ్మ
భార్య: లక్ష్మి, కుమారులు: అరుణ్, వరుణ్
విద్యార్హత: 10వ తరగతి, వృత్తి: కాంట్రాక్టర్
రాజకీయ ప్రస్థానం: 1988లో టీడీపీలో చేరి, 1999లో టీడీపీ నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.


