నిడమనూరు : ఓ లింగా.. ఓ లింగా నామస్మరణతో ఎర్రబెల్లి గుట్ట(గొల్లగట్టు) మారుమోగింది. లింగమంతులస్వామి జాతర సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ఎర్రబెల్లి గుట్టపై లింగమంతులస్వామి, మాణిక్యాలదేవి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. గోపాలపురం నుంచి వచ్చిన దేవరపెట్టలోని దేవతమూర్తులకు యాదవులు, పూజరులు(బైండ్ల) సంప్రదాయబద్దంగా కల్యాణం నిర్వహించారు. తలంబ్రాలను పోసిన అనంతరం మాణిక్యాలదేవి, యలమంచమ్మ దేవతలకు భక్తులు జీవాలుకోసి, మొక్కులు చెల్లించుకున్నారు. డోలు, కటారుల విన్యాసాల నడుమ నైవేథ్యాలను సమర్పించారు. ఎర్రబెల్లి పరిసరాలు సోమవారం భక్తులతో నిండిపోయాయి.


