ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి

Mar 9 2026 7:42 AM | Updated on Mar 9 2026 7:42 AM

నల్లగొండ టౌన్‌ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న సామ్రాజ్యవాద యుద్ధాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్క్రతిక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఆధిపత్యం కోసం ఇరాన్‌పై దాడులు చేస్తూ వందలాది మందిని హత్య చేస్తున్నాయన్నారు. ఈ యుద్ధాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాకి భాస్కర్‌, చింతమల్ల గురూజీ, వీరస్వామి, సి.అనిత, పల్లెబోయిన జానీ, బొమ్మకంటి కొమరయ్య, బంటు రామలింగయ్య, వెంకటేశ్వరరావు, జహీరాబేగం, రాజు, వెంకటయ్య, నరసయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement