నాగార్జునసాగర్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నందికొండ మున్సిపాలిటీకి చెందిన జానకిరెడ్డి ఏకగ్రీవంగా నియామకయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వోరుగంటి ఆనంద్ ఆదివారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలి పారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నేరవేర్చేందు కు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం, ఆత్మగౌ రవం, సంక్షేమం కోసం కృషిచేస్తానని తెలిపారు.
పేదల పక్షాన సీపీఐ
నిరంతర పోరాటం
గుర్రంపోడు : పేదల పక్షాన సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలంలోని చామలేడులో నలుగురు వార్డు సభ్యులతోపాటు 50 మంది సీపీఐలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో అంజచారి, రేపాక లక్ష్మీపతి, వెంకట్‌రెడ్డి, షేక్ మదార్, చేవూరి శంకరాచారి, పగిల్ల రమేష్, ఆవుల సైదులు, లింగమ్మ, రమేష్, కవిత, వార్డు సభ్యుడు దోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బత్తాయి రైతుకు పురస్కారం
గుర్రంపోడు : జీవన ఎరువులు వాడి బత్తాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించిన గుర్రంపోడు మండలం బ్రహ్మణగూడెం గ్రామానికి చెందిన రైతు కట్టెబోయిన శ్రీనివాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రైతు పురస్కారం అందించింది. ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోరమాండల్ సంయుక్తంగా నిర్వహించిన మెగా రైతుమేళా కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా రైతు శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు.
పలువురి అభినందన
రైతు శ్రీనివాస్ ఉత్తమ పురస్కారం అందుకోవడంపై బత్తాయి రైతుల జిల్లా పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షుడు సురుగురు శ్రీనివాస్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ ఉపేందర్‌రెడ్డి, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి ఽకృతజ్ఞతలు తెలిపారు.


