ఘనంగా లక్ష్మీనృసింహుడి డేగాట | - | Sakshi
Sakshi News home page

ఘనంగా లక్ష్మీనృసింహుడి డేగాట

Mar 9 2026 7:42 AM | Updated on Mar 9 2026 7:42 AM

వేములపల్లి : మండలంలోని సల్కునూరులో ఆదివారం స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామికి డేగాట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వసంతోత్సవం(హోలి)ని ఘనంగా జరుపుకున్నారు. లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం అనంతరం స్వామి, అమ్మవారి దోపు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి డేగాట నిర్వహిస్తారు. ఈ సమయంలో వేదపండితుల ఆధ్వర్యంలో గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు స్వామివైపు, మరో గ్రూపు చెంచులక్ష్మి అమ్మవారి వైపు ఉండి రంగులతో డేగాట ఆడతారు. ఆ తరువాత రంగులు చల్లుకుంటారు. ఆనవాయితీ ప్రకారం గ్రామంలోని చిన్నాపెద్దా అని తారతమ్యం లేకుండా ఆదివారం అందరూ ఈ వేడకల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement