పట్టణంలోని తాళ్లగడ్డలో ప్రభుత్వ భూముల కబ్జాపై రెవెన్యూ అధికారులు విచారణ జరపాలి. అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలి. ఇప్పటికే నిర్మాణం చేసుకున్న వారందరికీ ప్రభుత్వం తరఫున పట్టాలు అందించాలి. ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసేటప్పుడు మిగిలిన కొంత ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమించి అమ్ముకున్నారు. ప్రభుత్వం సర్వే చేసి ఆ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలి. కబ్జాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– బంటు పద్మ, 3వ వార్డు కౌన్సిలర్
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తాళ్లగడ్డలో ప్రభుత్వ భూముల్లో చదును చేస్తున్న సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లాం. లేఅవుట్ వేసిన తరువాత మిగిలిన ఖాళీ స్థలాలను కాపాడాల్సిన బా ధ్యత మున్సిపల్ అధికారులపై ఉంటుంది.
– శ్రీనివాస్, తహసీల్దార్, మిర్యాలగూడ


