నమూనా క్షేత్రం
ఏర్పాటు..
పాంపాండ్ల నిర్మాణం..
వలసలు పోవడం లేదు..
ప్రకృతి వ్యవసాయం వైపు గిరిపుత్రుల అడుగులు
● తోటల పెంపకం, కూరగాయల సాగుపై దృష్టి
● ఆధునిక పద్ధతులు, యంత్రాలతో
వ్యవసాయంలో రాణింపు
● ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు
అందిపుచ్చుకొని సత్ఫలితాలు
● మైదాన ప్రాంత రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న నల్లమల చెంచులు
–8లో u
●
మాకు ఎకరాన్నర భూమి ఉండగా.. అర ఎకరంలో బెండకాయ, గోకరికాయ, చిక్కుడుకాయలు పండిస్తున్నాం. రోజు విడిచిరోజు కూరగాయలు తెంపి విక్రయిస్తాం. సగటున రోజుకు రూ.2–3 వేల ఆదాయం వస్తుంది. కూరగాయల సాగుకు ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నాం. అటవీ ప్రాంతం దగ్గర ఉండటంతో తరుచుగా జంతువులు వస్తుంటాయి. వాటి నుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వం కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– నిమ్మల సాలెమ్మ, చెంచుగూడెం, బల్మూర్ మండలం
ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో వానాకాలం పంట వేయలేదు. యాసంగిలో వేరుశనగ పంట సాగు చేసేందుకు భూమి బీడుగా ఉంచాం. కాడెద్దులతో కూలీ పనికి వెళ్తున్నా. మా గూడెంలోని కుటుంబాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వ్యవసాయ పనులకు తోడు ఉపాధి హామీ పథకం పనులు కూడా చేస్తున్నాం. – ఉడుతనూరి నర్సింహ,
రైతు, చెంచుగూడెం బల్మూర్ మండలం
గతంలో మాకు అటవీ సంపదలే ఆసరాగా ఉండేవి. మా గూడెంలోని చెంచులందరూ ఇతర ప్రాంతాలకు వలస పోయేవాళ్లు. ఇప్పుడు వ లస పోకుండా ఇక్కడే బతుకుతున్నాం. ఇక్కడే ఉంటూ ఉపాధి పనులు, పత్తి తీ యడం, మేసీ్త్రల కింద కూలీ పనులకు వె ళ్తున్నాం. మా గూడెంలో సగం మందికి వ్యవసాయ భూమిలేదు. గతంలో ఇచ్చిన మాదిరిగా ప్రభుత్వం మాకు భూమి ఇవ్వాలి.
– నిమ్మల విజయ్‌కుమార్,
కూలీ, చెంచుగూడెం బల్మూర్ మండలం
జనజీవన స్రవంతికి దూరంగా.. నల్లమల అడవిలో నివశిస్తూ.. దుర్భరమైన జీవితాలు గడిపిన చెంచులు.. అవకాశాలను అందిపుచ్చుకొని ప్రగతి పథంలో పయనిస్తున్నారు. ఒకానొక సందర్భంలో నాగరిక సవూజానికి దూరంగా ఉంటూ.. అటవీ ఉత్పత్తుల సేకరణ, వలసలే ప్రధాన వృత్తిగా కొనసాగిన చెంచుగూడెం చెంచులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) వీరి కోసం ఖర్చు చేసిన నిధులు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొంటూ చెంచులు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. వ్యవసాయంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తూ ఇతర వర్గాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి, పత్తి, మినుములు, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ వంటి సంప్రదాయ పంటలతోపాటు ఆయిల్‌పాం, మామిడి తోటలు, కూరగాయల తోటలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. – అచ్చంపేట/ బల్మూర్
చెంచులు వ్యవసాయ రంగంలో రాణించేందుకు 1996లో ఐటీడీఏ ఐపాడ్ పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. అప్పట్లో బల్మూరు మండలంలోని చెంచుగూడెంలో 75 చెంచు కుటుంబాలు ఉండగా 32 కుంటుంబాలకు పండ్ల తోటల పెంపకానికి చేయూత అందించారు. ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాల చొప్పున 64 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. మొదట ఏడు బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం, పైపులైన్, ఎద్దులు ఇచ్చారు. ప్రస్తుతం 40 బోర్లు, మోటార్లు ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ప్రగతి సాధించి సొంతంగా బోర్లు వేసుకుంటున్నారు. కొంతమంది చెంచులు మామిడి తోటలు తొలగించి కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగు చేస్తున్నారు. నల్లమలోని చెంచుపెంటల్లో 300లకుపైగా ఎకరాల్లో తోటలు పెంపకం ప్రోత్సహించగా చాలాచోట్ల ఈ పథకం విఫలం కాగా చెంచుగూడెం చెంచులు మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సత్ఫలితాలు సాధించారు. గూడెంలో సగం కుటుంబాలకు వ్యవసాయ భూమి లేకపోవడంతో ఉపాధి హామీ పనులతోపాటు ఇతర పనులు చేసుక ్డుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో వలసలు వెళ్లిన ఈ గ్రామ చెంచులు ప్రస్తుతం ఇక్కడే ఉంటూ అందుబాటులో ఉన్న పనులు చేసుకుంటున్నారు.
తక్కువ నీటితో లాభదాయక వ్యవసాయం చేసేందుకు చెంచు రైతులు వ్యవసాయ కుంట (పాంపాండ్)లు నిర్మించుకున్నారు. పైపులైన్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించుకుంటూ తక్కువ నీటితో ఆయిల్‌పాం, మామిడి తోటలు, కూరగాయల సాగు చేపడుతున్నారు. మామిడితోటలు, ఆయిల్‌పాం తోటల్లో వేరుశనగ, మినుమలు, మొక్కజొన్న వంటి అంతర్ పంటలు సాగు చేస్తున్నారు.
ఆఽదునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఐటీడీఏ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం నమూనా క్షేత్రం ఏర్పాటు చేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల రైతులు అనేక ప్రయోజనాలు పొందుతూ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో పంట పొలాల నిర్జీవంగా మారుతున్నాయనే కారణంగా ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ చెంచులను సేంద్రియ సాగు వైపు దృష్టి మళ్లించారు. వీరు పండించే ప్రకృతి సేద్య పంటలకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. సమీప గ్రామాల ప్రజలు ముందుగానే వీరు పండించే పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు.
చెంచులు తమకు ఉన్న ఎకరా, అర ఎకరా పొలంలోనే కూరగాయలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా గోంగూర, బెండకాయ, గోకరికాయ, చిక్కుడుకాయ వంటి కూరగాయలు పండిస్తూ నెలకు సుమారు రూ.30–50 వేల ఆదాయం పొందుతున్నారు. కూలీలతో పని లేకుండా కుటుంబ సభ్యులే కూరగాయలు మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు.
అప్పట్లో మా బాధలను గుర్తించిన ప్రభుత్వం మాకు భూములు ఇచ్చి మామిడితోటలు పెట్టించారు. తోట పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ తోటను తొలగించి 3 ఎకరాల పొలంలో ఆయిల్‌పాం మొక్కలు నాటాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంతో దీని వైపు మొగ్గు చూపాం. మరో 2.5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో పత్తిపంటను స్ప్రింక్లర్లతో నీటిని తడుపుతున్నాం. పైపులైన్, డ్రిప్ ఇరిగేషన్‌తోపాటు వాడుతున్నాం.
– కాట్రావత్ వరలక్ష్మి, మహిళా రైతు, చెంచుగూడెం, బల్మూర్ మండలం


