చివరి బిల్లు ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

చివరి బిల్లు ఎప్పుడో?

Jul 30 2026 5:06 AM | Updated on Jul 30 2026 5:06 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు

జిల్లావ్యాప్తంగా రూ. 31కోట్లు బకాయి

వడ్డీ భారం పెరుగుతుందని

లబ్ధిదారుల ఆందోళన

పీఎంఏవై–జీ నిధులు వస్తేనే

బిల్లులు అందే అవకాశం

నాగర్‌కర్నూల్‌: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు కలగా మారుతోంది. బేస్మెంట్‌, రూప్‌, స్లాబ్‌ లెవల్‌ వరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ. 3.40 లక్షలు అందినా.. చివరి విడత బిల్లు కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో ఇంటికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.60లక్షల బిల్లు పెండింగ్‌లో ఉంది. జిల్లాలో ఇప్పటికే 2,019 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన దాదాపు రూ. 31కోట్ల బకాయిలు ఉన్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ పథకం ద్వారా చివరి బిల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

పెరుగుతున్న అప్పుల భారం..

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్న వెంటనే బిల్లులు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మూడు విడతల బిల్లులు రూ. 3.40లక్షలు మాత్రమే అందగా.. మిగతా రూ. 1.60లక్షలు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–జీ కింద చెల్లించాల్సి ఉంది. బిల్లులు సకాలంలో అందకపోవడంతో లబ్ధిదారులకు అప్పు ల భారం తప్పడం లేదు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం అందించే రూ. 5లక్షలతో పాటు మరో రూ. 3లక్షల నుంచి రూ. 6లక్షలకు పైగా అదనంగా వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసుకున్నామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.

రూప్‌ లెవల్‌

బేస్‌మెంట్‌

ప్రారంభించని నిర్మాణాలు

అప్పుచేసి నిర్మించుకున్నా..

బయట అప్పు తెచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మా ణం పూర్తిచేసుకున్నా. ఇంటికి రంగులు సైతం వేసుకున్నా. చివరి బిల్లు దాదాపు రూ. 1.20లక్షలు రావాలి. సకాలంలో బిల్లు రాకపోవడంతో అప్పుపై మరింత వడ్డీ పెరుగుతుంది. వెంటనే బిల్లు ఇప్పించి ఆదుకోవాలి.

– సురేశ్‌, తాడూరు

ఆందోళన వద్దు..

లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలి. బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అ వసరం లేదు. చివరి బిల్లు త్వరలోనే అందుతు ంది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనుల్లో వేగం పెంచడంతో పాటు ఇంకా ప్రారంభించని వారు మొదలుపెట్టాలి. రెండో విడతలో గుడిసెలున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం.

– గోపాల్‌నాయక్‌, పీడీ, హౌసింగ్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement