దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

కందనూలు: జిల్లా పరిధిలోని షెడ్యూల్డ్‌ కులాల న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరంలో న్యాయ పరిపాలనలో శిక్షణ పొందడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు మూడు సంవత్సరాలపాటు నెలకు రూ.3 వేల ఉపకార వేతనంతోపాటు అదనంగా పుస్తకాలు, ఫర్నిచర్‌ కొనుగోలు నిమిత్తం రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 31లోపు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎకై ్సజ్‌ డీసీగా

విజయ్‌భాస్కర్‌రెడ్డి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా శ్రీనివాస్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కారీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉంటూ ఇన్‌చార్జి డీసీగా ఉన్న విజయ్‌భాస్కర్‌రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్‌గా డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్‌ నుంచి జి.శ్రీనివాస్‌ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా వచ్చారు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్‌గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్‌గా ఉన్న పి.కరమ్‌చంద్‌ పదోన్నతిపై గద్వాల ఈఎస్‌గా వచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏఈఎస్‌గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్‌ ఈఎస్‌గా వెళ్లారు.

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా

వేణుగోపాల్‌రెడ్డి

కందనూలు: జిల్లా నూతన ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్‌రెడ్డి గురువారం నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన గాయత్రి పదోన్నతిపై మెదక్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. నూతనంగా వచ్చిన వేణుగోపాల్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో పనిచేస్తుండగా బదిలీల్లో భాగంగా ఇక్కడికి వస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement