వానాకాలం సాగు వరి వంగడాల రకాలు ప్రకటించిన అధికారులు
పెరిగిన డిమాండ్
● వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
● అయోమయంలో అన్నదాతలు
● రైతులకే ప్రయోజనం అంటున్న అధికారులు
● జిల్లాలో 1.92 లక్షల ఎకరాల సాగు అంచనా
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో కేవలం 7 రకాల సన్నరకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది 33 రకాల సన్నాలకు బోనస్ అందించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుంది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నా.. గతంతో పోల్చితే వాటి సంఖ్య కుదించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
1,92,796 ఎకరాల్లో సాగు
జిల్లాలోని 20 మండలాల్లో ఈ ఖరీఫ్‌లో 1,92,796 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది 1,80,753 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల సన్నాలను మాత్రమే సాగు చేయాలని సూచించడంతో.. వాటిలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కవ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకునేందుకు రైతులు తర్జనభర్జన పడుతున్నారు. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉంటుండడంతో వారికి నచ్చిన సీడ్ ఎంచుకునేవారు. ఈ ఏడాది అన్నదాతలకు ఆ అవకాశం లేదు.
వ్యవసాయ శాస్త్రవేతలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌లో ఆ విత్తనానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్‌కు సుమారు 3,600 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా 3,900 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ.. ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు. తక్కువ గైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మధుమేహ బాధితులు, మంచి ఆరోగ్యం కోరుకునే వారు తెలంగాణ సోనాను ఎంచుకుంటున్నారు. సాంబా మసూరి ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో అత్యధిక అదరణ పొందుతున్న సన్న బియ్యం. వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా.. ఎక్కవ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రొత్సహించాలని నిర్ణయించారు.
డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145
డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145
●
వరి సన్నరకం పంట


