‘కో–ఆప్షన్‌’.. కలేనా..! | - | Sakshi
Sakshi News home page

‘కో–ఆప్షన్‌’.. కలేనా..!

Jun 23 2026 1:58 AM | Updated on Jun 23 2026 1:58 AM

నారాయణపేట/మరికల్‌: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్‌ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షనన్‌ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షనన్‌ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. గ్రామాభివృద్ధికి సలహాదారులుగా ఉండాల్సిన వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● గ్రామపాలనలో ప్రజల అనుభవాన్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కో–ఆప్షనన్‌ సభ్యుల వ్యవస్థ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఏర్పడి

ఆరునెలలు గడిచినా కో–ఆప్షన్‌ సభ్యుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో అనుభవం, సేవాభావం ఉన్న వ్యక్తులను పాలనలో భాగం చేయడంతో అభివృద్ధి ప్రణాళికలకు నాణ్యత పెరగాలనేది దీని ఉద్దేశం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement