● జిల్లాలో వనమహోత్సవానికి శ్రీకారం
● ఈసారి 35లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం
కందనూలు: గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించి.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 35లక్షల మొక్కలు నాటి పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
శాఖల వారీగా కేటాయింపు..
జిల్లాలో ప్రభుత్వ శాఖలవారీగా వనమహోత్సవ లక్ష్యాలను కేటాయించారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో 21.60 లక్షలు, అగ్రికల్చర్ 2.10 లక్షలు, పంచాయతీరాజ్ 1 లక్ష, ఎకై ్సజ్ 1.90 లక్షలు, ఫారెస్టు 1.40 లక్షలు, హార్టికల్చర్ 1 లక్ష, ఇండస్ట్రీస్ 5వేలు, ఇరిగేషన్ 7వేలు, మున్సిపల్‌శాఖ 6.70 లక్షలు, పోలీసు 4వేలు, ఆర్‌అండ్‌బీ 5వేలు, ట్రైబల్ వెల్ఫేర్ 5వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
460 జీపీల్లో నర్సరీలు..
జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రతి జీపీలో నర్సరీ ఏర్పాటుచేసి, నేరెడు, మునగ, వేప, కానుగ, చింత, మందార, గులాబీ మొక్కలతో పాటు డ్రాగన్ ప్రూట్స్, కర్జూర మొక్కలు తదితర మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 5వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ప్రయోజనం చేకూరేనా?
గత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా చోట్ల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఏడాదైనా అధికారులు సమన్వయంతో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
మండలం జీపీలు మొక్కలు
అచ్చంపేట 38 1,90,000
అమ్రాబాద్ 20 1,00,000
బల్మూర్ 23 1,15,000
బిజినేపల్లి 35 1,75,000
చారకొండ 17 85,000
కల్వకుర్తి 24 1,20,000
కోడేరు 16 80,000
కొల్లాపూర్ 18 90,000
లింగాల 23 1,15,000
నాగర్‌కర్నూల్ 18 90,000
పదర 10 50,000
పెద్దకొత్తపల్లి 28 1,40,000
పెంట్లవెల్లి 10 50,000
తాడూరు 24 1,20,000
తెలకపల్లి 28 1,40,000
తిమ్మాజిపేట 26 1,30,000
ఉప్పునుంతల 27 1,35,000
ఊర్కొండ 16 80,000
వంగూర్ 27 1,35,000
వెల్దండ 32 1,60,000
మండలాల వారీగా నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలు..


