కందనూలు: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సంచార జాతుల వారు ఏర్పాటుచేసుకున్న గుడారాలను గురువారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా సంచార జాతుల వారికి, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఇక్కడే తమకు వచ్చిన పనులు చేసుకొని జీవిస్తున్నామని.. అకస్మాత్తుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌ను ’సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. తాము వారం రోజుల నుంచి వారికి వేరే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నామని తెలిపారు.


