ఓటరు జాబితా సవరణపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణపై అవగాహన ఉండాలి

Jun 18 2026 1:17 AM | Updated on Jun 18 2026 1:17 AM

అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త, నాయకుడికి అవగాహన ఉండాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా మ్యాపింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓటర్లను తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బీఆర్‌ఎస్‌కు చెందిన బీఎల్‌ఏలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అదే విధంగా ఈ నెల 22న అచ్చంపేటలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరవుతారని చెప్పారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై పార్టీ కార్యకర్తలకు త్వరలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పోకల మనోహర్‌, మాకం తిరపతయ్య, కె.తులసీరాం, నర్సింహాగౌడ్‌, అమీనుద్దీన్‌, కేటీ తిరుపతయ్య, పర్వతాలు, కరుణాకర్‌రావు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement