ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 1,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.791 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
సుంకేసుల డ్యాం వద్ద రెండు గేట్లను ఎత్తారు. ఉదయం ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటును ఒక మీటర్ మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.


