తిమ్మాజిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను బస్సు యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన, ప్రగతి నివేదిక బస్సు యాత్ర గురువారం తిమ్మాజిపేటకు చేరుకోవడంతో మండల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వివేక్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివాస్, నాయకులు ఉస్మాన్, లక్ష్మీనారాయణ, దేవస్వామి, మాధవులు, సురేందర్, వెంకటయ్య, రాము, రాజు, బాలకృష్ణ, రాఘవేందర్, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడూరు: పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మల్లురవి చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల అమలుపై చేపట్టిన బస్సుయాత్ర మండల కేంద్రానికి చేరుకుంది. ఆయా గ్రామాల కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణరావు, సర్పంచ్‌మల్లయ్య, అధ్యక్షుడు రమేష్, రాంచంద్రారెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు వినోద్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి


