అందుబాటులో 1,008 టన్నుల యూరియా
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 1,008 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ నెలలో జిల్లాకు 6,619 టన్నుల యూరియా కేటాయించారని.. నేటి నుంచి గద్వాల, జడ్చర్ల రేక్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తారన్నారు. మొత్తం 300 ఎరువుల దుకాణాల్లో రైతులకు యూరియా పంపిణీ చేస్తారని.. ప్రతి డీలరు ఏఓ, ఏఈఓ నిర్ధారించిన రైతులకు మాత్రమే ఎరువులు ఇవ్వాలని తెలిపారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
కల్వకుర్తి రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా.మల్లు రవి ఉన్నారు. ఆదివారం రాత్రి కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఆయన పల్లెనిద్ర చేశారు. ముందుగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలియజేయడంతో పాటు పలువురు తమకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందన్నారు. రఘుపతిపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం సర్పంచ్ గణేశ్ ఇంట్లో ఆయన రాత్రి బస చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయకుమార్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా కూడారై ఉత్సవం
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధానార్చకుడు ప్రసాదాచార్యులు, అర్చకులు నవీన్ స్వామి, నరసింహాచార్యులు, తివారి ఆధ్వర్యంలో స్వామివారికి వైష్ణవ సంప్రదాయంలో కూడారై ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొర్త చంద్రారెడ్డి, గుబ్బ సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రభోత్సవానికి ముస్తాబు
● 15న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల ఊరేగింపు
● 16న భోగమహేశ్వరంలో కల్యాణోత్సవం
అందుబాటులో 1,008 టన్నుల యూరియా
అందుబాటులో 1,008 టన్నుల యూరియా


