లక్ష్యం.. గ్రీన్‌ గంగాపురం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. గ్రీన్‌ గంగాపురం

Jan 12 2026 7:57 AM | Updated on Jan 12 2026 7:57 AM

లక్ష్

లక్ష్యం.. గ్రీన్‌ గంగాపురం

జడ్చర్ల టౌన్‌: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫర్‌ గంగాపూర్‌ (స్వామి వివేకానంద యూత్‌) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్‌కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫర్‌ గంగాపూర్‌ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్‌ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్‌ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు.

లక్ష్యం.. గ్రీన్‌ గంగాపురం 1
1/1

లక్ష్యం.. గ్రీన్‌ గంగాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement