బాలికలకు జీవన నైపుణ్యాలు అవసరం
కందనూలు: బాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరముందని రాష్ట్ర విద్యాశా ఖ ఆర్‌జేడీ సోమిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేజీబీవీల ప్రత్యేకాధికారులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేజీబీవీల్లో చదువుతున్న బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. బాలికలకు మెరుగైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కేజీబీవీల్లో ఎస్‌ఓలు అమ్మలా వ్యవహరించాలని.. విద్యార్థినులు ప్రత్యే కాధికారులనే తమ రోల్‌మోడల్‌గా భావిస్తారని తెలిపారు. విద్యార్థినులకు మంచి విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా సత్ప్రవర్తనలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేజీబీవీల్లో అమలుచేసి విద్యార్థినుల అభ్యున్నతికి కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో జీసీడీఓలు శోభారాణి, శుభలక్ష్మి, పూలమ్మ, నర్మద, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్ సూర్యచైతన్య పాల్గొన్నారు.


