ముంపు గ్రామాలను మినహాయించాలి
చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు నిర్వాసితులు ఎర్రవల్లి, ఎర్రవల్లితండా బాధితులు గురువారం జిల్లాకేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిశారు. ముంపు గ్రామాలను మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముంపు గ్రామాల సమస్యను అంసెబ్లీలో ప్రస్తావించారని కలెక్టర్‌కు వివరించారు. ముంపు పునరావసం, ఆర్‌అండ్‌ఆర్ తదితపరి చర్యలను నిలిపివేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు నాగయ్యనాయక్, పెద్దయ్యగౌడ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
38వ రోజుకు రిలే దీక్షలు
మండలంలోని గోకారం శివారులో చేపడుతున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి నిర్వాసితులకు న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 38వ రోజు కొనసాగాయి. ప్రభుత్వం స్పందించి ముంపు గ్రామాలను మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


