సర్వే చేయిస్తాం..
సింగోటం ఆలయ భూములు చాలాకాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ భూముల్లోని ముళ్ల పొదలు తొలగించే అంశం పరిశీలనలో ఉంది. అలాగే ఆలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూస్తాం. ముందుగా భూమి హద్దులు గుర్తించేందుకు సర్వే చేయించి.. కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.
– రంగారావు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓ, సింగోటం
పేద రైతులకు ఇవ్వాలి
సింగోటం ఆలయ భూ ములను రాజుల కాలం నుంచే మా గ్రామస్తులు కౌలు ప్రాతిపదికన సాగు చేస్తున్నారు. కానీ, చాలా ఏళ్లుగా రైతులకు కౌలుకు ఇవ్వడం లేదు. దీంతో ఆ భూములన్నీ బీళ్లుగానే ఉన్నాయి. పేద రైతులకు కౌలుకు ఇస్తే రైతులు బతకడంతోపాటు ఆలయానికి కూడా ఆదాయం వస్తుంది. దీనిపై దేవాదాయశాఖ అధికారులు దృష్టిసారించాలి. గతంలో భూములు సాగు చేసిన రైతులు శాశ్వత కౌలుకు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
– ఇందిరమ్మ, మాజీ సర్పంచ్, సింగోటం గ్రామం
●


