టోకెన్లు ఇస్తున్నారు..
యూరియా కోసం టోకెన్లు తీసుకున్న వారికే యూరియా ఇస్తున్నారు. నేను 10 ఎకరాలు సాగుచేసినా మూడు బస్తాలే ఇచ్చారు. దీనికోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద తీసుకునేందుకు అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం యూరియా బస్తాలు కావాలంటే నానో యూరియా సైతం కొనాలని ఒత్తిడి చేస్తున్నారు.
– రాజప్ప, రైతు,
గొరిట, తిమ్మాజిపేట మండలం
అమ్రాబాద్ పీఏసీఎస్‌లో యూరియా లేదు. రైతు ఉత్పత్తిదారుల సహకార కేంద్రంలో యూరియా పంపిణీ చేస్తున్నారు. నేను రెండెకరాల్లో వరి సాగుచేస్తుండగా నాకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. ఇంకా కావాలని అడిగితే తర్వాత ఇస్తామని చెబుతున్నారు.
– సత్తయ్య, రైతు,
తిర్మలాపూర్(బీకే), అమ్రాబాద్ మండలం
జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. సాగు విస్తీర్ణం ఆధారంగా మండలాలకు అవసరమైన యూరియా కేటాయించాం. ప్రతి వారం అవసరమైన యూరియా జిల్లాకు అందుతుంది. ఎవరైనా డీలర్లు యూరియా స్టాక్ చేసుకున్నా.. నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటాం.
– యశ్వంత్‌రావు, డీఏఓ
●
టోకెన్లు ఇస్తున్నారు..


