అధిక మొత్తంలో వసూలు
లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు రూ.5–6 వేలు, భ్రూణ హత్యలకు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రూ.30–50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణులకు గుట్టుగా అబార్షన్లు చేసే క్రమంలో వికటించి మృతిచెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని వెలుగులోకి రాగా.. మరికొన్నింటిని బయటకు రాకుండా సెటిల్‌మెంట్ చేసుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వైద్యాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా.. ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదని తెలుస్తోంది.
జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్‌లో రికార్డులు తనిఖీ చేస్తున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ (ఫైల్)


