పండుగ ఆనందంగా జరుపుకోవాలి : కలెక్టర్
నాగర్‌కర్నూల్: పవిత్రమైన రంజాన్ పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది.. ప్రేమమూర్తిగా మార్పు చెందుతారన్నారు. ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ.. దాతృత్వాన్ని అలవరిచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.


