● లింగాల గ్రామానికి చెందిన చెన్యూరి కన్నయ్యకు మూడేళ్లుగా ఓటరు జాబితాలో పేరు లేదు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ అందించిన ఎన్యూమరేషన్ ఫారం కూడా అందలేదు. ఈ క్రమంలో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తన పేరు ఓటరు జాబితాలో లేదని అధికారుల దృష్టికి కన్నయ్య తీసుకెళ్లారు. దీంతో పేరు చేర్చుకునేందుకు ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయించారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో కన్నయ్యకు తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం లభించింది.
మంగపేట: మండల పరిధిలో 25 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. బుచ్చంపేటలో 222వ పోలింగ్ కేంద్రం పరిధిలో 850 మందికి ఓటర్లు ఉండగా 145 మంది ఓటర్ల వివరాల్లో వివిధ రకాల సవరణలపై వివరాలను కోరుతూ బీఎల్‌ఓ లక్ష్మణ్ నోటీసులు జారీ చేశారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన గాలిబు తరమ్మకు ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం అందలేదు. దీంతో ఓటరు జాబితాలో పేరు సైతం రాలేదు. తన భర్త వెంకమల్లుకు సైతం ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం రాకపోవడంతో ఓటరు లీస్ట్‌లో పేరు లేదు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఇద్దరికి ఓటు హక్కు వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను వేడుకుంది.


